అమెరికా ఆరోపణల నేపథ్యంలో అదానీని అరెస్ట్ చేయాలి - రాహుల్ గాంధీ

On
అమెరికా ఆరోపణల నేపథ్యంలో అదానీని అరెస్ట్ చేయాలి - రాహుల్ గాంధీ

అమెరికా ఆరోపణల నేపథ్యంలో అదానీని అరెస్ట్ చేయాలి - రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ నవంబర్ 21:
ఒకటిగా  ఉంటే,  సురక్షితంగా ఉంటామని నరేంద్ర మోదీ స్లోగన్ ఇచ్చారు: అందుకే
భారత్‌లో నరేంద్రమోడీ, అదానీ ఒక్కటైతే సేఫ్. భారతదేశంలో అదానీని ఏమీ చేయలేము. అమెరికా ఆరోపణల నేపథ్యంలో అదానీని అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
న్యూ ఢిల్లీ లో పత్రికసమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ,
ఇక్కడ ముఖ్యమంత్రిని జైలుకు పంపిన మోడీ,   రూ.2 వేల కోట్ల కుంభకోణం చేసి బయట తిరుగుతున్న గౌతం అదానీ మాత్రం బయట హుందాగా తిరుగుతున్నారని రాహుల్ ఆరోపించారు.

ఎందుకంటే నరేంద్ర మోదీ వారిని కాపాడుతున్నారు.
అదానీ భారత్‌, అమెరికాలో నేరాలకు పాల్పడ్డాడని అమెరికా విచారణ చెబుతోంది. కానీ భారత్‌లో అదానీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

• అదానీని అరెస్ట్ చేయాలి
• మాధబి బుచ్‌ని పదవి నుండి తొలగించి, ఆమెపై విచారణ జరపాలి.

Tags