రాష్ట్రంలో పెరుగుతున్న బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యుల ఆందోళనలు
మా భర్తలు పోలీసులా.. కూలీలా!! భార్యల ఆవేదన
రాష్ట్రంలో పెరుగుతున్న బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యుల ఆందోళనలు
మా భర్తలు పోలీసులా.. కూలీలా!!
హైదరాబాద్ అక్టోబర్ 24;
తెలంగాణా లో వరుసగా పెరుగుతున్న పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆందోళనలు
మొన్న నల్లగొండ, నిన్న వరంగల్ లలో ఆందోళనలు..ఈరోజు సిరిసిల్ల, గుడిపేట, డిచ్ పల్లి లలో కుటుంబ సభ్యుల. ఆందోళనలు
తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సిరిసిల్ల, గుడి పేట లో 17వ బెటాలియన్ వద్ద ఆందోళన చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు. తెలంగాణ అంతటా ఒకే పోలీసింగ్ విధానం ఉండాలని డిమాండ్.
ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా :
సిరిసిల్ల లో పోలీసు కానిస్టేబుల్ భార్యల ఆందోళన..మా భర్తలు పోలీసులా.. కూలీలా!!
మా భర్తలను లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చెపిస్తున్నారు.
మా భర్తలకు ఎక్కువ డ్యూటీలు వేసి మాకు, మా సంసారాన్ని కుటుంబాన్ని దూరం చేస్తున్నారు.
పోలీసు డ్యూటీకి మా భర్తలు చేస్తున్న పనికి సంబందం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు