ఇదెక్కడి న్యాయం - మంత్రుల కొరకు బడి పిల్లలను రొడ్డెక్కిస్తారా ?
ఇదెక్కడి న్యాయం - మంత్రుల కొరకు బడి పిల్లలను రొడ్డెక్కిస్తారా?
కరీంనగర్ డిసెంబర్ 03:
గత టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల చెలగాటం ఆడటమె కాకుండా స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా మండుటెండలో మంత్రులు వస్తున్న సమయంలో విద్యార్థులతో నృత్యాలు చేపిస్తూ తాగడానికి కూడా మంచినీళ్లు ఇవ్వకుండా ఎండలో నిలబెట్టారను, దానికి తోడు కొందరు రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న వ్యక్తులు మంత్రుల మెప్పు పొందేటందుకు స్కూల్ సమయంలో విద్యార్థులను తీసుకువచ్చి ప్లాకార్డులు ఇచ్చి మంత్రులు వచ్చేవరకు ఎండలో నిలబెట్టదం అన్యాయమని బీసీ నాయకులు, విమర్శించారు.సమాచార హక్కు విజ్ఞాన సమితి రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ విమర్శించారు.
దీనికి వారి దగ్గర సమాధానం ఉండదు. వారు చేసింది న్యాయం.. అప్పటి ఐటీ శాఖ మంత్రి తనయుడు విద్యార్థులతో ముత్యాలు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు.. కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టే వారు..
ఈ సమయంలో నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఊకంటి నరేందర్ రెడ్డి డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రోజున బైక్ ర్యాలీ మరియు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తే పిల్లలు తమ తల్లిదండ్రులతో ఇష్టపూర్వకంగా వచ్చి నృత్యాలు చేస్తే టిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి పిల్లలను వాడుకుంటున్నారని డిఇఓ కు కంప్లైంట్ చేయడం విడ్డూరమని, మరి మీరు చేసింది మంచి పనా అని మేము ప్రశ్నిస్తున్నామని. సమాచార హక్కు విజ్ఞాన సమితి రాష్ట్ర అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్ అన్నారు.