ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

On
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల డిసెంబర్ 1 (ప్రజా మంటలు) : 

ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .

జగిత్యాల పట్టణ 7వ వార్డులో 10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ,మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 

గెలిపించిన ప్రజలకు అభివృద్ధి తో రుణం తీర్చుకుంటా అని,ప్రజల అభీష్టం మేరకు వార్డు అభివృద్ధి కి కృషి చేస్తా అన్నారు ఎమ్మెల్యే.

5 ఏండ్ల లో ప్రతి వార్డుకు దాదాపు 2 కోట్ల వరకు నిదులు మంజూరు చేయటం జరిగింది అని,అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు ఎమ్మెల్యే.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్ రేణుక మొగిలి, కోలగని ప్రేమలత సత్యం ,కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్ ,పట్టణ వార్డు నాయకులు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags