తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు - తెలంగాణలో భూప్రకంపనల కలకలం
తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
తెలంగాణలో భూప్రకంపనల కలకలం
ఇళ్ల లోని నుండి భయంతో పరుగులు తీసిన ప్రజలు..రిక్టార్ స్కెల్ పై 5.3 తీవ్రత నమోదు...
హైదారాబాద్ డిసెంబర్ 04:
20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం...
విజయవాడ లో ఉదయం 7 గంటల 26 నిమిషాలకు 5 సెకండ్ల పాటు కంపించిన భూమి..
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లో 3 సెకండ్ల పాటు కంపించిన భూమి..
హైదారాబాద్,రంగారెడ్డి లో హయత్ నగర్ తో పాటు కొన్ని ప్రాంతాలు, భద్రాచలం, కొత్త గూడెంలలో కూడా 5 సెకండ్ల పాటు కంపించిన భూమి..
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి...
ఇండ్లలో సామాన్లు, వస్తువులు కదలడంతో ప్రజల్లో ఆందోళన...
ములుగు కేంద్రంగా 225 కిమీ పరిధిలో తెలంగాణలో స్వల్పంగా కంపించిన భూమి...
మేడారం పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 4న ప్రకృతి భీభత్సం లో సుమారు 50 వేల చెట్లు ఎక్కడైతే కూలాయో.. ఈ భూకంపం కూడా అక్కడే మొదలయిందని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలోనీ గడ్చిరోలి జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు గుర్తించారు.