సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి
* సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి
సికింద్రాబాద్ డిసెంబర్ 03 (ప్రజామంటలు) :
రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల తాము అవగాహన పెంచుకుంటూ, ఇతరులను ఎడ్యుకేట్ చేయాలని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అసోసియేట్ డైరెక్టర్ సీమా సిక్రి పేర్కొన్నారు. మంగళవారం ఆమె భోలక్ పూర్ కృష్ణానగర్ లోని కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్ స్టూడెంట్స్ కు సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించారు. మొబైల్స్ కు వచ్చే అనవసర లింకులపై క్లిక్ చేయవద్దని, స్పామ్ కాల్స్ ను అటెండ్ చేయకుండా, వాటిని బ్లాక్ చేయాలన్నారు. ఓటీపీలను ఇతరులకు షేర్ చేయవద్దని, ఏదేని అనుమానం వస్తే వెంటనే 1930 నెంబర్ కు డయల్ చేసి, రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థులు తమ సైబర్ క్రైమ్ అవెర్నెస్ ను ప్యారెంట్స్, ఇతరులతో పంచుకొని, వారికి కూడ సైబర్ క్రైమ్ లపై వివరించాలని కోరారు. స్కూల్ కరస్పాండెంట్ డా.మంచాల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
–––––––––
–ఫొటో: