కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ - 10 మంది మృతి
కూరగాయల వ్యాపారుల పైకి దూసుకెళ్లిన లారీ - 10 మంది మృతి
హైదారాబాద్ డిసెంబర్ 02:
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరి గేటు వద్ద ఓ లారీ అదుపుతప్పి కూరగాయలు అమ్ముకునే వ్యాపారులపై దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది వ్యాపారులు అక్కడికక్కడే మృతి చెందగగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్-బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు.వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీ కొట్టి ఆగింది.
లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్లో అన్లోడ్ చేసి తిరిగి వికారాబాద్ వెళ్తున్న క్రమంలో లారీ అదుపుతప్పడంతో ఈ ఘటనకు చోటుచేసు కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్- బీజాపుర్ రహదారి భయానక వాతావరణం నెలకొంది.లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు.
ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తుంది, క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.