GPS లోపంతో, కారు కాలువలో పడి ముగ్గురికి గాయాలు

ఇటీవలి కాలంలో ఇది రెండవ సంఘటన

On
GPS లోపంతో, కారు కాలువలో పడి ముగ్గురికి గాయాలు

GPS లోపంతో, కారు కాలువలో పడి ముగ్గురికి గాయాలు

బరేలీ (ఉత్తర ప్రదేశ్) డిసెంబర్ 04: ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో నావిగేషన్ వ్యవస్థ తప్పుదారి పట్టించడంలో ఇది రెండో ఘటన, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు

మంగళవారం పిలిభిత్-బరేలీ హైవేపై Google Mapsను అనుసరిస్తున్నప్పుడు, కొట్టుకుపోయిన రోడ్డునే గూగుల్ మ్యాప్ చూపడంతో,  కాలాపూర్ కాలువ సమీపంలో కారు బోల్తా పడింది.బోల్తా పడిన కారును క్రేన్ తొ పైకి తీసారు.

కారులో ఉన్నవారు కాన్పూర్ నుండి పిలిభిత్‌కు వెళుతుండగా బర్కాపూర్ తిరహా గ్రామ సమీపంలో ప్రముఖ నావిగేషన్ సిస్టమ్‌ను అనుసరించి, పక్కదారి పట్టి కాలాపూర్ కాలువలో పడిపోయినట్లు పోలీసు సూపరింటెండెంట్ (నగరం) మనుష్ పారిక్ తెలిపారు.

Tags