పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నాగరాజు
పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నాగరాజు
సికింద్రాబాద్ డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
పవర్ గ్రిడ్ SRTS-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎ.నాగరాజు బాద్యతలు స్వీకరించారు. సదరన్ రీజియన్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్-1లో తెలంగాణ, AP తో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో సబ్ స్టేషన్లు, ప్రాజెక్టులున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఎ.నాగరాజు 1986లో NTPCలో ఇంజినీర్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించి 1991లో పవర్ గ్రిడ్ లో ఇంజినీర్ గా చేరారు. ఆయనకు 38 ఏండ్లకు పైగా అనుభవం ఉంది. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, కాంట్రాక్ట్స్, కమర్షియల్, ఎన్విరాన్ మెంట్ అండ్ సోషల్ మేనేజ్ మెంట్, ఈ ఎస్ జీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి విభాగాల్లో పనిచేశారు. బెంగళూరు, హైదరాబాద్, నాగ్ పూర్, కార్పొరేట్ సెంటర్ వంటి ప్రదేశాల్లో సేవలందించారు.
ఎస్ ఆర్ టీఎస్ -1 బాధ్యతలు చేపట్టక ముందు గురుగ్రామ్ లోని పవర్ గ్రిడ్ కార్పొరేట్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈఎస్ఎండీ అండ్ సీఎస్ ఆర్ )గా పనిచేశారు.
-------------------
-ఫొటో