వికారాబాద్ జిల్లా కలెక్టర్, కాడ స్పెషల్ అధికారి, రెవెన్యూ అధికారులపై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన.

On
వికారాబాద్ జిల్లా కలెక్టర్, కాడ స్పెషల్ అధికారి, రెవెన్యూ అధికారులపై దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు)

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐ.ఏ.ఎస్ మరియు కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి మరియు ఇతర రెవెన్యూ అధికారులపై దుద్యాల మండలంలో జరిగిన దాడికి నిరసనగా ఈరోజు జగిత్యాల జిల్లా సముదాయము లో రెవెన్యూ ఉద్యోగులు మరియు టి.ఎన్.జి.ఓస్ మరియు జే.ఏ.సీ నాయకులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన తెలుపడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి జగిత్యాల పి.మధుసూదన్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి మెట్టుపల్లి శ్రీ ఎన్ శ్రీనివాస్ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ తరపున మాట్లాడుతూ.....

వికారాబాద్ కలెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి చాలా బాధాకరమని, ప్రభుత్వం ద్వారా ఫార్మాసిటీ కొరకు భూసేకరణ కొరకు వెళ్లిన ఉద్యోగులపై దాడి చేయడం చాలా బాధాకరమని ఇట్టి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని తెలిపినారు మరియు కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పి.హనుమంతరావు మాట్లాడుతూ..... విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి దిగడం వలన ఉద్యోగుల మనోభావాలకు దెబ్బతీసే చర్య కాబట్టి ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే దోషులను శిక్షించాలని కోరినారు.

తెలంగాణ రెవెన్యూ సర్వీస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరపున యం.ఎ.షాదాబ్ హకీమ్, భూమయ్య, కిరణ్, సుమన్, సంతోష్, తిరుపతి వరప్రసాద్, మహమూద్ మరియు వివిధ మండలాల రెవెన్యూ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు.  

రెవెన్యూ సంఘం తరఫున భూమయ్య, మహమూద్ మాట్లాడుతూ..... నిన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై మరియు రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని మరియు ఉద్యోగుల భద్రత ను ప్రశ్నించే విధంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసే ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకు పోవడమే కాకుండా, ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఆదేశాలను అమలు చేయడంలో ప్రత్యేక పాత్ర పోషించడం జరుగుతుంది ఇట్టి చర్యను ఖండించినారు.

టీఎన్జీవో సంఘం తరపున జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ..... ఉద్యోగులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న జరిగిన దాడి ఉందని, కానీ ఉద్యోగులు పనిచేసేది ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే విధంగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని వారలు అందరికీ కూడా భద్రత కల్పించాలని కోరినారు మరియు తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల తరపున మేము కూడా ఇట్టి సంఘటనను ఖండిస్తూ మద్దతు తెలుపుతున్నాము.

ఇట్టి కార్యక్రమంలో టి.ఎన్.జి.ఓస్ మరియు జే.ఏ.సీ తరఫున టీఎన్జీవో నాయకులు అమరేందర్ రెడ్డి, షాహిద్ బాబు, రవిచంద్ర, రవీందర్, మహమూద్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, హరి ప్రసాద్, భువనేశ్వర్, కుమారస్వామి, సురేందర్, భాస్కర్, శ్రీనివాస్, మురళి, చంద్రిక, మమత, శైలజ, విజయలక్మి, అర్చన, నాగరాజు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చంద్రయ్య, ముజాహిద్ ఖాన్, అరుణ, అజీం, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags