సైబర్ మోసాల,ట్రాఫిక్ నియమాలపై, విద్యార్థులకు అవగాహన సదస్సు
సైబర్ మోసాల,ట్రాఫిక్ నియమాలపై, విద్యార్థులకు అవగాహన సదస్సు
గొల్లపల్లి డిసెంబర్ 04 (ప్రజా మంటలు):
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండల లోని చిల్వకోడూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు షీ టీం, కళాబృందం లతో ట్రాఫిక్ నియమాలు, గంజాయి వల్ల కలిగే అనర్ధాలు, సైబర్ మోసాల, నూతన చట్టాలు గురించి గొల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్.సతీష్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ సిహెచ్ సతీష్, మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే ముందు వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసు కోవాలని సూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ నియమాలు తెలిసినప్పుడే రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించగలుగుతామని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయని వీటిపై అవగాహన కలిగి వుండాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీబాయి హెడ్ కానిస్టేబుల్ తుమ్మ గణేష్ ,చంద్రయ్య పోలీసు సిబ్బంది, షీ టీమ్, కళాబృందం సభ్యులు విద్యార్థిని విద్యార్ధులు పాల్గొన్నారు.