జగిత్యాల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్

On
జగిత్యాల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్

 జగిత్యాల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్

జగిత్యాల డిసెంబర్ 04:

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ బాడీ  సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్ ను ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకొన్నారు 

ఈ సమావేశంలో సభ్యులందరూ నూతన అధ్యక్షునికి సన్మానం చేశారు.  అనంతరం నూతన అధ్యక్షులు గంగుల శ్రీధర్ మాట్లాడుతూ నా చిన్నతనం నుండి క్రీడలపట్ల అవగాహనతో క్రీడల్లో రాణించాలని ప్రత్యేక విద్యార్థిని కోరుకునే వాడిననీ, ఈ అవకాశం వలన నాకు జిల్లా అధ్యక్షునిగా సంఘ సభ్యులు పెద్ద బాధ్యతగా ఇవ్వడం వలన నాకు ఇంత బాధ్యత పెరిగింది నేను సంఘం కొరకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని క్రీడాకారులకు క్రీడా ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు వలన మన అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోటీల వలన మన సంఘం కు మంచి గుర్తింపు లభించిందని, ఈ పేరును ఎల్లవేళలా మనము కాపాడుకుంటూ, సంఘము కొరకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్  ఉపాధ్యక్షులు ఈ అంజయ్య. G రాందాస్. రమేష్ జాయింట్ సెక్రెటరీ L  జ్యోతి. కోశాధికారి B బి కొమురయ్య సంఘ సభ్యులు ప్రశాంత్   అశోక్  మరి పెళ్లి కార్తిక్. Ch  రవళి  నీరెళ్ళ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags