కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడిగా జక్కుల అనిల్

On
కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడిగా జక్కుల అనిల్

ప్రజామంటలు భీమదేవరపల్లి డిసెంబర్ 4

గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి మండల యూత్ కమిటీ నియామకాన్ని ఆన్లైన్ సభ్యత్యాలను చేపించి ఆన్లైన్ పద్ధతిలోనే మండల కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశం ఏర్పరిచారు. ఇందులో భాగంగా యూత్ కాంగ్రెస్ నాయకులు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా సభ్యత్వ నమోదుకు పోటీపడ్డారు. ఇలా ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఎన్నికలలో భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా జక్కుల అనిల్ 961 ఓట్లతో కాంగ్రెస్ యూత్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చిట్కూరి అనిల్ 614 ఓట్లతో, బుర్ర రమేష్ 175 ఓట్లతో, గుడి కందుల రాజు 153 ఓట్లతో, పబ్బ అజయ్ 25 ఓట్లతో మండల ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Tags