గంజాయిని వినియోగిస్తున్న ఇద్దరు యువకులపై కేసు నమోదు*
గంజాయిని వినియోగిస్తున్న ఇద్దరు యువకులపై కేసు నమోదు*
గొల్లపల్లి నవంబర్ 07 (ప్రజా మంటలు):
బుగ్గారం మండలంలోని వెల్గోండ క్రాస్ రోడ్ నమ్మదగిన సమాచారంతో బుగ్గారం మండలం వెల్గొండ గ్రామానికి చెందిన గుజ్జేటి వంశీ మరియు ధర్మపురికి చెందిన తుమ్మ ఉపేందర్ గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా వారి వద్ద నుండి 100 grms ల గoజాయిని బుగ్గారం పోలీస్ లు స్వాదినపరుచుకున్నారు.
వివరాల్లోకి వెళితే : వెల్గొండ గ్రామానికి చెందిన గుజ్జేటి వంశీ గత కొన్ని నెలల నుండి గంజాయి త్రాగుటకు బానిసైనాడు, తన వద్ద ఉన్న గంజాయిని తనకు కావలసినంత త్రాగి మిగతాది ఇతరులకు అమ్మేవాడు. ఈ క్రమంలో ధర్మపురికి చెందిన తుమ్మ ఉపేందర్ అతనితో పరిచయం ఏర్పడినది ఇద్దరూ కలిసి వారికి కావలసినంత వారు వినియోగించి మిగతాది తమ యొక్క అవసరాలకు, జల్సాలకు గoజాయని ఇతరులకు అమ్మేవారు. ఈరోజు కూడా ఇతరులకు అమ్మే క్రమంలో బుగ్గారం పోలీసు వారు సరైన సమాచారాన్ని తెలుసుకొని వారిని వెల్గొండ క్రాస్ రోడ వద్ద అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు