కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే - బియారెస్ విమర్శలు
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా ధర్నాలే - బియారెస్ విమర్శలు
కాంగ్రెస్ ఏడాది బర్బాది
హైదరాబాద్ డిసెంబర్ 04:
'రాష్ట్రంలో ఏ వర్గపు ప్రజలను చూసినా ఏమున్నది గర్వకారణం.. తెలంగాణ సమస్త ప్రజానీకం మొత్తం ఆందోళనల పర్వం’ అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రగతిభవన్‌ను దొరల గడీ అని దొంగ ముద్రవేసి.. నాటి ఆంధ్రా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన కంచెలు బద్దలు కొట్టి.. ప్రజల భావోద్వేగంతో ఆడుకుని.. ప్రజాభవన్‌గా పేరుమార్చారను బి అర్ ఎస్ విమర్శించింది.
కానీ, ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చకపోవడంతో ఆ ప్రజాభవన్ కాస్తా.. ప్రజా ఆందోళనల భవన్‌గా మారింది. ప్రజావాణి పేరుతో జరుగుతున్న దగాను గుర్తించిన ప్రజానీకం.. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభవన్ దద్దరిల్లేలా గర్జిస్తున్నారు. ఒక్కో వర్గపు ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. కళ్లుండీ కనిపించని, చెవులుండీ వినిపించని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజాభవన్‌లోనే నిరసనలు తెలుపుతున్నారు. ఏడాది కాలంగా ప్రజాభవన్‌లో మిన్నంటిన ఆందోళనలు, ధర్నాలు, నిరసనల దృశ్యాలివి..