మైత్రి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభోత్సవం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల డిసెంబర్ 2 (ప్రజా మంటలు) :
ట్రాన్స్ జెండర్ లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలో మైత్రి ట్రాన్స్ క్లినిక్ లను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని వర్చువల్ గా ప్రారంభించారు.
దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్లినిక్ ను జిల్లా అధికారులు ప్రారంభించారు.
ఈ క్లినిక్ ల ద్వారా ఆరోగ్య /ఆరోగ్యేతర సేవలపై కౌన్సిలింగ్, లింగ ఆధారిత సేవలు, సాధారణ ఆరోగ్య సేవలు, లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స, సామాజిక అర్హత సేవలు, ఇతర క్లినిక్ / ల్యాబ్ సమాచారం సేవలను ట్రాన్స్ జెండర్లకు అందిస్తారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా. నరేష్, మాత శిశు ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ రాములు మాట్లాడుతూ.....
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్ జెండర్ లకు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్ జెండర్ లపై ఎలాంటి వివక్ష లేకుండా వారు సమాజంలో అన్ని అభివృద్ధి ఫలాలు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో చేపట్టినట్లు తెలిపారు.
ట్రాన్సె జెండర్ లకు ప్రభుత్వ ఆర్థిక పునరావాస పథకం కింద నాన్ బ్యాంక్ లింకేజి కింద 100 శాతం సబ్సిడీ కింద 50,000 రూపాయలు మరియు బ్యాంక్ లింకేజి ద్వారా 80% సబ్సిడీతో 1 లక్ష రూపాయలు మరియ 70% సబ్సిడీతో 2 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పారు.స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పిస్తారు.
ట్రాన్స్ జెండర్ లకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ : 155326 సంప్రదించగలరు .