పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు
ఒక్కరోజే 2232 మంది ఔట్ పేషంట్లు- 192 మంది అడ్మిట్
పేషంట్ల రద్దీతో కిటకిటలాడిన గాంధీ ఆసుపత్రి ఓపీ వార్డు
* ఒక్కరోజే 2232 మంది ఔట్ పేషంట్లు- 192 మంది అడ్మిట్
సికింద్రాబాద్ నవంబర్ 04 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి ఔట్ పేషంట్ల వార్డు సోమవారం పేషంట్ల రద్దీతో కిటకిటలాడింది. పండుగల వరస సెలవుల అనంతరం సోమవారం గాంధీ ఓపీ వార్డుకు మొత్తం 2232 మంది వివిద అనారోగ్య కారణాలతో రాగా, వీరిని పరీక్షించిన వైద్యులు ఇందులో 192 మందిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, వైద్యం అందిస్తున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీకే.సునీల్ తెలిపారు. ఓపీ పేషంట్ల రద్దీ పెరిగినప్పటికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాయంత్రం ఓపీ కూడ ఉన్నందున ప్రజలు సాయంత్రం 4 నుంచి 6 వరకు నడిచే ఈవినింగ్ ఓపీ సేవలను కూడ వినియోగించుకోవచ్చు.సిటీ నుంచే కాకుండా ఓపీ వైద్య సేవలకై రాష్ర్టంలోని వివిద జిల్లాల నుంచి కూడ వేలాది మంది పేషంట్లు గాంధీకి వస్తుంటారు. తీవ్ర అనారోగ్యానికి గురయిన వారికి, దివ్యాంగుల కోసం ఓపీ వార్డు వద్ద మరిన్ని వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
–––––––––––––––––