హాస్టల్లో పిల్లలకు వడ్డించే ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండాలి. - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 23 (ప్రజా మంటలు) :
హాస్టల్లో పిల్లలకు వడ్డించే ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అన్నారు.
జిల్లా అధికారులతో ఫుడ్ సేఫ్టీ పైన సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్.
శనివారం రోజున కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోఆర్డినేషన్ రెస్పాన్స్ ఇన్సిడెంట్ పై కమీషనర్ ఫుడ్ అండ్ సేఫ్టీ ఆదేశంల క్రమంగా జగిత్యాల జిల్లాలో ప్రతి పాఠశాలలో ఆహార పదార్థాల నాణ్యత మరియు వారికి ప్రతిరోజు వడ్డించే ఆహార పదార్థాలపై ప్రతి పాఠశాల యందు ఆహారం నాణ్యతగా ఉండేలా కమిటీలను సంబంధిత పాఠశాల విద్యార్థులకు మరియు హాస్టల్లో వడ్డించే ఆహార పదార్థాలపై నాణ్యత ఉండాలని ఎటువంటి పొరపాట్లు చేయకుండా ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన ఆహార పదార్థాలను వడ్డించాలని కోరారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..... ప్రభుత్వ పాఠశాలలో గాని రెసిడెన్షియల్ స్కూల్లో గాని మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పురుగులు పట్టిన బియ్యాన్ని కాకుండా నాణ్యతమైన బియ్యాన్ని గాని ముడి సరుకులు గాని నాణ్యమైనవి అందించాలని వాటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ప్రతి రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీ టేస్ట్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఫుడ్ పాయిజన్ కేసులు జిల్లాలో జరగకుండా కావాల్సినన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో , అదనపు కలెక్టర్లు , బిఎస్ లత , గౌతమ్ రెడ్డి,జిల్లా బిసి ఎస్సి ,వెల్ఫేర్, అధికారులు , ఆర్డీఓలు ,మధు సుధను, జి వాకర్ రెడ్డి , శ్రీనివాస్, డి ఆర్ డి ఓ రఘువరన్, జిల్లా సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.