చాంద్ పాషా జీవితం స్ఫూర్తిదాయకం..

'గల్ఫ్ గాయం' - ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు.. చాంద్ పాషా అటోబయోగ్రఫీ..

On
చాంద్ పాషా జీవితం స్ఫూర్తిదాయకం..

చాంద్ పాషా జీవితం స్ఫూర్తిదాయకం..

'గల్ఫ్ గాయం' - ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు..
చాంద్ పాషా అటోబయోగ్రఫీ..
ప్రముఖులకు అందజేత

జగత్యాల అక్టోబర్ 28 (ప్రజా మంటలు) :

జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి, మాజీ ఎంపి, కాంగ్రెస్  ప్రచార కమిటీ చైర్మన్

 మదుయాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్ లను టీ పీసీసీ ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్ పాషా కలిసి, రెండు దశాబ్దాలుగా గల్ఫ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్న తన జీవిత గాథను, గల్ఫ్ కార్మికుల సమస్యలను, “గల్ఫ్ గాయం” పుస్తకం రూపంలో ప్రజల ముందుకి తీసుకు వచ్చానని తెలిపారు. వీరితో పాటు, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ కు “గల్ఫ్ గాయం” పుస్తకాలను అందజేశారు.

రెండు దశాబ్దాలుగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, గల్ఫ్ కుటుంబాలను ఆదుకోవాలని పోరాటం చేస్తున్న చాంద్ పాషా జీవితం స్ఫూర్తిదాయకం అని చాంద్ పాషాను కొనియాడారు. ఈ సందర్భముగా గల్ఫ్ బాధితుల పక్షాన గత రెండు దశాబ్దంగా పోరాటం చేస్తున్న షేక్ చాంద్ పాషా రూపొందించిన "గల్ఫ్ గాయం * ఇంకెన్నాల్లీ కన్నీళ్లు  పుస్తకాన్ని మధు యాస్కి గౌడ్, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విఫ్, ధర్మపురి అడ్లురి  లక్ష్మణ్ కుమార్లకు  గల్ఫ్ గాయం' పుస్తకం అందించారు. ఈ సందర్భముగా షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల పక్షాన తన పోరాటానికి మద్దతుగా నిలిచిన ఎం పీ గా మధు యాష్కీ గౌడ్ 2008 నుండి 2014 వరకు పార్ల మెంటులో గల్ఫ్ బాధితుల పక్షాన గళం వినిపించారని అన్నారు.

 

ఉమ్మడి రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో మాత్రమే పాస్పోర్ట్ అఫిసులు ఉండేవని, మధు యాష్కీ గౌడ్ ప్రోత్సాహంతో  ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని అన్ని పాత జిల్లాల్లో పాస్ పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది.  మదుయాస్కీ గౌడ్ చోరవతో   విదేశాలకు వెల్లే వారి భీమా సౌకర్యం 5 లక్షల నుండి రు.10 లక్షలకు పెంచడం జరిగింది గుర్తు చేశారు.

2009 గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి కృషితో, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఎన్ ఆర్ ఐ బోర్డ్ స్థాపించారు. అప్పుడే, ప్రస్తుత మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును ఎన్ ఆర్ ఐ శాఖ మంత్రిగా నియమించారన్నారు.

 మొట్టమొదటగా అన్ని కలెక్టరేట్లలో ఎన్ ఆర్ ఐ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి 2014 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఎమ్మెల్యే గా గెలుపొంది, గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రు.5 లక్షల పరిహారం అందజేయాలని పోరాటం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గల్ఫ్ బాధిత కుటుంబాలకు రు.5 లక్షల పరిహారం సాదించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.

స్వర్గీయ  కొం రెడ్డి రాములు  2009 అసెంబ్లీలో వాదించి గల్ఫ్ బాదిత కుటుంబాలకు రు.1 లక్ష ఆర్థిక సాయం అందించేలా జీ 256 బిల్ పాస్ చేయించడం లో ప్రముఖ పాత్ర పోషించారు. రెండు దశాబ్దాలుగా ఈ ముగ్గురు కాంగ్రెస్ నాయకుల అండదండలతో తాను గల్ఫ్ సమస్యలపై పోరాటం చేస్తూ, ఒడిదుడుకులను అధిగమిస్తున్ననని చాంద్ పాషా అన్నారు. గల్ఫ్ లో నా ప్రత్యక్ష అనుభవంతో పాటు, గల్ఫ్ కార్మికుల కష్టాలు ప్రత్యక్షంగా చూసి, చలించిపోయానని,

తెలంగాణ ప్రజలకు గల్ఫ్ కష్టాలు కళ్లకు కట్టేలా ' గల్ఫ్ గాయం ఇంకెన్నాళ్లీ కన్నీళ్లు'  పుస్తకం రాశానని షేక్ చాంద్ పాష అన్నారు.

-----------

Tags