విమానాలు లేటైతే ప్యాసింజర్లకు స్నాక్స్, వాటర్..!

On
విమానాలు లేటైతే ప్యాసింజర్లకు స్నాక్స్, వాటర్..!

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

ఢిల్లీ నవంబర్ 23 (ప్రజా మంటలు) : 

ఎయిర్లైన్ ప్యాసింజర్ల కోసం DGCA కీలక నిర్ణయం తీసుకుంది.. విమానాలు ఆలస్యమైనప్పుడు వారికి ఎయిర్ లైన్ సంస్థలు తాగునీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 

2 గంటలు ఆలస్యమైతే వాటర్, 2-4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ, స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. 

ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగ మంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే..

Tags