గోదావరి మహా హారతి పోస్టర్ ఆవిష్కరణ

30న ధర్మపురిలో గోదావరి మహా హారతి

On

IMG-20241123-WA0566గోదావరి మహా హారతి పోస్టర్ ఆవిష్కరణ

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

ధర్మపురి నవంబర్ 23 :

దక్షిణ కాశీగా ప్రసిద్ధి కాంచిన ధర్మపురిలో గతలో 13 సంవత్సరాల నుండి గోదావరి మహా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఆవరణలో గోదావరి మహా హారతిIMG-20241123-WA0567పోస్టర్లను  రాష్ట్ర కో కన్వీనర్ దామోర రామ్ సుధాకర్ ఆవిష్కరించారు. అలాగే ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా దామెర 
రామ్ సుధాకర్ మాట్లాడుతూ... ఈనెల 30వ తేదీన శనివారం సాయంత్రం 4:00 గంటలకు గోదావరి మహా హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష పండితులు, 
 పౌరాణికులు బ్రహ్మశ్రీ పాలెపు భరత్ శర్మ,  జిల్లా కన్వీనర్  పిల్లి శ్రీనివాస్,  సంగి నరసయ్య, కస్తూరి రాజన్న, బెజ్జారపు లవన్ , బండారి లక్ష్మణ్, దొనకొండ నరేష్, నల్లమాసు వైకుంఠం, గాజు భాస్కర్, తిరుమందాస్ సత్యనారాయణ, అప్పం మల్లేష్, దివిటి శ్రీధర్, పల్లెర్ల సురేందర్, కాశెట్టి హరీష్, నవీన్ పాల్గొన్నారు.

Tags