కోరుట్లలో సహారా ఇండియా బాధితుల సమావేశం
డబ్బులు చెల్లించాలని డిమాండ్
కోరుట్లలో సహారా ఇండియా బాధితుల సమావేశం
గొల్లపల్లి నవంబర్ 24 ప్రజా మంటలు
సహారా ఇండియా బాధితులకు డబ్బులు చెల్లించాలని కోరుట్లలో సాయిబాబా టెంపుల్ ఆవరణలో సమావేశం అయ్యారు.
కోరుట్ల లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సహారా ఇండియా బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం పూజిత మాట్లాడుతూ, దేశంలో 13 కోట్ల మంది ఖాతాదారులు డబ్బులు 80 లక్షల కోట్ల రూపాయలు చెల్లించకుండా సహారా ఇండియా ప్రభుత్వం కాలయాపన చేస్తూ పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు.
వీడియో లింక్:
https://youtu.be/uYt6GZqg4w0?si=wI175nLygf27tap8
గత పార్లమెంటు ఎలక్షన్లో ప్రతి ఖాతాదారునికి నయా పైసతోసా చెల్లిస్తామని బహిరంగ సభలో చెప్పినటువంటి నరేంద్ర మోడీ, అట్లాగే అమిత్ షా,అధికారం వచ్చిన తర్వాత సహారా బాధితులకు ఇచ్చిన హామీని నీటి మూటగా చేశారు. సుప్రీంకోర్టు కేసు పేరు మీద ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. మార్చ్ 2023లో పోర్టల్ ద్వారా చెల్లిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పత్రిక ముఖంగా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని ప్రకటన ఇస్తే దేశంలో నాలుగు కోట్ల మంది ఖాతాదారులు దరఖాస్తు చేసుకుంటే కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ఖాతాదారులకు ఇవ్వడం జరిగింది
భవిష్యత్తులో ఎన్నో అవసరాలకు పనికొస్తాయని కొండంత ఆశతో ఖాతాదారులు పొదుపు చేసుకుంటే ఏ అవసరానికి పనికి రాకుండా డబ్బులు పోయాయని వారు అన్నారు
అనంతరం ప్రధాన కార్యదర్శి మీ బాలయ్య మాట్లాడుతూ గత పార్లమెంటు సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు బాండ్లు తెచ్చుకోండి డబ్బులు ఇచ్చే బాధ్యత నాయిదని పార్లమెంటు సభల సాక్షిగా చెప్పినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈరోజు ఎవరికి ఇవ్వకుండా ఊరికే ప్రజల్ని మభ్యపెడుతుంది అని అన్నారు ప్రభుత్వము కోర్టు, సహారా ఇండియా కంపెనీ ఆడుతున్న నాటకంలో 13 కోట్ల ప్రజలు బలైతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రజలకు సహారా డబ్బులు వచ్చేవరకు ప్రయత్నం చేయాలని అన్నారు డబ్బులు రానీయెడల వచ్చే ఎలక్షన్లలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ నిత్యం కూలి నాలుగు చేసుకొని పేద ప్రజలు పొదుపు చేసుకుంటే వారి డబ్బుల్ని కంపెనీ ఎగనామం పెట్టిందని అన్నారు అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచి డబ్బుల్ని కంపెనీ దోచుకున్నదని అన్నారు అనంతరం జగిత్యాల జిల్లా అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ పోర్టల్ ద్వారా ఇస్తామని ప్రజల్ని మభ్యపెడుతుందని అన్నారు పిల్లల పెండ్ల కోసం గృహ నిర్మాణం కోసం చదువుల కోసం పనికి వస్తాయని పొదుపు చేసుకుంటే ఏ పనికి రాకుండా పోయాయని అన్నారు ఈ సభలో 200 పైగా కాతదారులు పాల్గొని వారి గోడును వినిపించారు ఈ కార్యక్రమంలో జక్కుల గణేష్ ముత్యాల నరేష్ రామస్వామి బి నారాయణ గొప్ప రాతి శ్రీనివాస్ సిరిపురం రాజ్ కుమార్ బోప్పరాతి పురుషోత్తం అల్లే గంగాధర్ ప్రభాకర్ శ్రీనివాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు