వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదు. - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల రూరల్ నవంబర్ 3 (ప్రజా మంటలు) :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ జగిత్యాల జిల్లా ఆద్వర్యం లో జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్ పల్లి గ్రామం లో ఉచిత ఆరోగ్య శిబిరం,ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రజలు వైద్యం విషయం లో నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సామాజిక సేవలో మొదటి వరుసలో ఉండాలని జగిత్యాల డయాగ్నిస్టిక్ లో 135 రోగాలకు ఉచిత పరీక్షలు చేస్తారు.ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మెడికల్ కాలేజి,సూపర్ స్పెసిలిటీ ఆసుపత్రి ఏర్పాటు తో ప్రజలకు నాన్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు.
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ మంచాల కృష్ణ, ప్యాక్స్ ఛైర్మెన్ సందీప్ రావు,రోటరీ క్లబ్ సభ్యులు,జిల్లా ఎస్సి ఎస్టి మానిటరింగ్ కమిటీ సభ్యులు టివి సూర్యం, జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్,డా.జైపాల్,వైద్యులు,నాయకులు బాల ముకుందం,గడ్డం నారాయణ రెడ్డి,చెరుకు జాన్,మహేశ్వర్ రావు, చిర్ర నరేష్,అంజయ్య,మల్లయ్య,పరశురామ్ గౌడ్,రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్,గంగారాజం,గంగన్న,మహేష్,శ్రీపాల్,తిరుపతి,మోహన్,మల్లేష్,రమేష్,సత్యనారాయణ రావు,అంజి రెడ్డి, బీరయ్య,వైద్యులు,ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎం లు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.