రోడ్డు మధ్యలో నాటిన  హానికరమైన " ఏడాకుల చెట్ల" ను తొలగించాలి -35వ వార్డు కౌన్సిలర్ జయశ్రీ

On
రోడ్డు మధ్యలో నాటిన  హానికరమైన

పట్టణంలో రోడ్డు మధ్యలో నాటిన  హానికరమైన " ఏడాకుల చెట్ల" ను తొలగించాలి -35వ వార్డు కౌన్సిలర్ జయశ్రీ

 జగిత్యాల/గొల్లపల్లి నవంబర్ 22 :          

జగిత్యాల పట్టణంలో హరిత హరం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ గత పది సంవత్సరాల క్రితం " ఏడాకుల చెట్లను " వందల సంఖ్యలో నాతరని, ఈ చెట్టునీ "దయ్యం చెట్టుగా" పిలుస్తారని,ఏడాకుల చెట్లు, పూతకు వచ్చి ప్రజలు ఆ వాసన వల్ల అనారోగ్యాలు ఎదుర్కొంటున్నారని వీటిని తొలగించాలని 35వ వార్డు కౌన్సిలర్ జయశ్రీ మునిసిపల్ కమిషనర్ చిరంజీవికి వినతి పత్రం ఇచ్చారు.

ఈ చెట్టు మరియు పూవు పుప్పొడి వాసన వల్ల శ్వాసకోస వ్యాదులు, అస్తమా రోగులకు చాలా డేంజర్ అని గతంలోనే ప్రభుత్వాలు ప్రకటించడం జరిగింది కొన్ని రాష్ట్రాలలో అన్ని చెట్లను తొలగించడం ద్వారా శాశ్వత పరిష్కారం చేసారు. కాని, మన తెలంగాణ ప్రభుత్వం వారు తొలగించక పోవడం వల్ల జగిత్యాల పట్టణ ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ  రోజు జగిత్యాల పట్టణ ప్రజలు వాకింగ్ కొరకు దరూర్ క్యాంప్,బైపాస్ రోడ్డు, కృష్ణ నగర్ మరియు ధర్మపురి రోడ్డు లలో ఈ ఏడు ఆకుల చెట్లు విపరీతంగా పెరిగి పూతకు వచ్చి ఓక రకమైన వాసన రావడం అక్కడ నడవలేని పరిస్థితులు ఉన్నాయి. కావున వెంటనే యుద్ధ ప్రాతిపదికగా తీసుకోని జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఏడాకుల చెట్టును తొలగించి ప్రజల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చేయాలని జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన జయశ్రీ కోరారు.

Tags