విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

గొల్లపల్లి నవంబర్ 22:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్ ఆదేశించారు.
గొల్లపెల్లి మండల కేంద్రంలో ఉన్న మహాత్మ జ్యోతి బాపులే బిసి వెల్ఫేర్ & జూనియర్ (బాలికల) కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి భోజనం. అందించాలని కలెక్టర్ సూచించారు..
పాఠశాలలో అన్ని వసతులు, సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని ప్రిన్సిపాల్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కిచెన్, స్టోర్ రూమ్ వంట గదిని పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు సరుకులు బియ్యాన్ని అందించాలని ఆదేశించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్ , బి సి వెల్ఫేర్ సాయి బాబా, ఎమ్మార్వో వరందన్ , ఎంపీడీవో , మండల సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పోరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ బి , సత్య ప్రసాద్ ఆదేశించారు.
గొల్లపెల్లి మండల కేంద్రంలో ఉన్న మహాత్మ జ్యోతి బాపులే బిసి వెల్ఫేర్ & జూనియర్ (బాలికల) కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి భోజనం. అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.