కాంగ్రెస్ పార్టీ పేదవారికి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుంది

On
కాంగ్రెస్ పార్టీ పేదవారికి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుంది

 

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీ పేదవారికి,అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా కష్టపడాలని వక్తలు పేర్కొన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పైన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ....

రాష్ట్రంలో ఎంత మంది పేదవారు ఉన్నారు,అర్హులైన ఎంత మంది పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి,వంటి తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని,ఇట్టి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేది నుండి ప్రారంభంకావడం జరుగుతుందని, అధికారులె నేరుగా ఇంటి ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను ఇవ్వాలని,దాని వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందనీ,కాంగ్రెస్ పార్టీ పేదవారికి,అట్టడుగువర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా మనం కష్టపడాలని,ప్రతి కార్యకర్త కష్టసుఖాలో వారికి తోడుగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం రాష్ట్రంలో విద్యార్థులకు కాస్మొటిక్ మరియు మెస్ చార్జీలు పెంచిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags