శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో స్కంధ షష్టి వేడుకలు

నేడు దేవసేన కళ్యాణ మహోత్సవం

On
శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో స్కంధ షష్టి వేడుకలు

శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో స్కంధ షష్టి వేడుకలు
 *  పాల్డుడి కావడి లతో స్వామివారికి అభిషేకం
 * వందలాది మంది భక్తుల రాక
 * నేడు దేవసేన కళ్యాణ మహోత్సవం

సికింద్రాబాద్​ నవంబర్​ 07 (ప్రజామంటలు) :

పద్మారావునగర్​ స్కందగిరి లోని శ్రీసుబ్రహ్మాణ్యస్వామి ఆలయంలో గురువారం స్కంధ షష్టి పర్విదినాన్ని పురస్కరించుకొని భక్తులు పాల్డుడి కావడి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల కలశాన్ని కట్టుకొన్న కావడిని భుజంపై ఎత్తుకొని ఆలయం చుట్టు గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారికి క్షీరాభిషేకం చేసి, తమ మొక్కులను తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిట,కిట లాడగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్​, సివిల్​ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా, శుక్రవారం ఆలయంలో శ్రీదేవసేన కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజింగ్​ ట్రస్టీ కృష్ణన్​ రాజమణి  తెలిపారు. అలాగే వెండి రథంపై స్వామి వారి ఉత్సవ విగ్రహాల గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. 
––––––––––––
–ఫొటోలు: 
1 : పాలకావడిలతో గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులు
2 : పాల కలశాలతో స్వామివారి చెంతకు భక్తులు
3 : ప్రధాన ఆలయంలో హోమం పూజలో పాల్గొన్న భక్తులు 
––

Tags