సర్ సి.వి.రామన్ కి ఘన నివాళి అర్పించిన పాఠశాల బృందం.*
విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలి ...పాఠశాల ప్రిన్సిపల్ కే నారాయణరెడ్డి
హుస్నాబాద్ (ప్రజామంటలు) :
హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక సర్ సి.వి.రామన్ ఉన్నత పాఠశాలలో ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు సర్ సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కాయిత నారాయణరెడ్డి గారు మాట్లాడుతూ సి.వి.రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనే తన పరిశోధన ద్వారా ప్రఖ్యాత నోబెల్ బహుమతిని పొంది భౌతిక శాస్త్రంలో ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిగా భారతదేశ పేరు ప్రఖ్యాతలను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసేల చేశారని, అలానే ప్రస్తుత విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రఖ్యాత శాస్త్రవేత్తలుగా ఎదిగి మన మాతృభూమికి గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.