రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. - మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 13 (ప్రజా మంటలు)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నమ్మిన రైతన్నకు 2 లక్షల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి ఆడువాల జ్యోతి అన్నారు.
మంగళవారం జగిత్యాల లో బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనా చేసిన విమర్శలు అర్థరహితమన్నారు.
10 సంవత్సరాలు చేసిన పాలనలో తెలంగాణ పేరుతో రైతులకూ, ప్రజలకూ, విద్యార్థులకూ, నిరుద్యోగులకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
జగిత్యాలలో బి ఆర్ ఎస్ నాయకుల మాటలు కోటలు దాటి, ప్రజల్ని మభ్య పెట్టే రీతిలో ఉన్నాయి తప్ప, ఏ వర్గం యొక్క సంక్షేమంను పెద్దగా పట్టించుకోలేదన్నారు. జగిత్యాల అభివృద్ధి గురించి మాట్లాడిన బిఆర్ఎస్ నాయకులు పట్టణ అభివృద్ధి కోసం చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
సుమారు 2 లక్షల జనాభా ఉన్న జగిత్యాల పట్టణంకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే డా. సంజయకుమార్ ఎన్నోమార్లు బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి బుట్ట దాఖలే అయ్యిందన్నారు.
అంతేగాకుండా, రోడ్డు వెడల్పు కార్యక్రమం ఎన్నికల నినాదంగానే మిగిలిపోయిందనీ, ఇందుకోసం ప్రభుత్వపరంగా బడ్జెట్ కేటాయించకపోవడం మర్చిపోయారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతూ, అన్ని వర్గాలకు అండగా ఉన్ననన్న భరోసా కల్పిస్తున్నారన్నారు.
విద్యా, ఉద్యోగ రంగాలే కాకుండా, దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం చేస్తున్నా కృషిని వక్రీకరిస్తే, అందుకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాలా జ్యోతి లక్ష్మణ్ హెచ్చరించారు.
అలాగే, గత 10 సంవత్సరాల కాలంలో బడుగు, బ్లహీన వర్గాలవారికి, మధ్యతరగతి ప్రజలకు అత్యంత అవసరమైన రేషన్ కార్డును ఇవ్వలేని పరిస్థితి మర్చిపోయారన్నారు.2014లో తెలంగాణా రాష్ట్రం సాధించుకున్న నాటినుండి పెళ్ళైన వారికీ ఇద్దరేసి పిల్లలు కలిగారు కానీ, వారి కుటుంబ పోషణ మరియు అన్ని అవసరాలు తీర్చేది, అనారోగ్య పరిస్థితుల్లో వైద్య సాయం అందించడానికి ఉపయోగపడే రేషన్ కార్డు అందించకుండా, రైతన్నల పేరిట మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అదే, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అందరితో చర్చించి, అందరి సమన్వయంతో సమగ్ర సర్వేకు పూనుకొని, రేషన్ కార్డు అందిచడానికి చర్యలు తీసుకుంటున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలే బుద్ది చెపుతారన్నారు.