గవర్నర్ ను కలిసిన స్టూడెంట్ ఆకర్షణ 

సొంత ఖర్చులతో అనాధ ఆశ్రయాలు,స్కూళ్లలో 17 లైబ్రరీ లను ఏర్పాటు .

On
గవర్నర్ ను కలిసిన స్టూడెంట్ ఆకర్షణ 

గవర్నర్ ను కలిసిన స్టూడెంట్ ఆకర్షణ 

సొంత ఖర్చులతో అనాధ ఆశ్రయాలు,స్కూళ్లలో 17 లైబ్రరీ లను ఏర్పాటు .

సికింద్రాబాద్,  నవంబర్ 06 (ప్రజా మంటలు)::

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఆకర్షణ తన తండ్రి సతిష్ తో కలిసి భేటీ అయ్యారు ఆకర్షణ తన సొంత ఖర్చులతో ఇప్పటివరకు అనాధ ఆశ్రయాలు,స్కూళ్లలో 17 లైబ్రరీ లను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆకర్షణను రాజ్ భవన్ కు ఆహ్వానించారు. వరసగా లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్న ఆకర్షణను గవర్నర్ అభినందించి, ఎంపిక చేసిన పుస్తకాల తో పాటు ఒక రిస్ట్ వాచ్ ని బహుమతిగా ఇచ్చారు.
 కాగా ఆకర్షణ ఈ నెల 25న సిటీలోని మూసాపేట శ్రీ సత్యసాయి బాలికల అనాధ ఆశ్రమంలో తన 18 వ లైబ్రరీని ప్రారంభిస్తున్నట్లు గవర్నర్ కు తెలిపారు 18వ లైబ్రరీని ప్రారంభించాల్సిందిగా గవర్నర్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి అందుకు అంగీకరించినట్లు ఆకర్షణ తండ్రి సతీష్ తెలిపారు.

కాగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 12 ఏండ్ల వయసు కలిగిన 8 వ క్లాస్ స్టూడెంట్ ఆకర్షణ గతంలో ప్రధానమంత్రి మోడీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కూడా కలిశారు.
----------
-ఫోటో

Tags