సమగ్ర కుటుంబ సర్వే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను టార్గెట్ పేరుతో వేధించడం సరికాదు. - తపస్.
సర్వే గడువు పొడగించండి - తపస్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు) :
తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులను టార్గెట్ల పేరుతో ఒత్తిడికి గురిచేయ వద్దని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద రావులు కోరారు.
ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు గౌతమ్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.
ప్రాథమిక తరగతుల బోధన గాడిలో పెడుదామని అనుకున్న ఉపాధ్యాయులకు సర్వే పేరుతో విధులు కేటాయించి,ఒక్కపూట మాత్రమే పాఠశాలలు నడపడం వల్ల అటు తల్లితండ్రులనుండి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
మరొకవైపు ఉపాధ్యాయుల మెడపై కత్తి పెట్టి, టార్గెట్ లు విధిస్తూ,రోజుకు 20 నుండి 25 కుటుంబాల సర్వే చేయాలని ఒత్తిడి చేయడం,సెలవులు పెట్టొద్దని వేధింపులకు గురిచేయడం తగదని తపస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఒక్కొక్క ఉపాధ్యాయుడు పగటి పూట సుమారు 4 గం.లు సర్వే చేస్తే 10 నుండి 12వరకు చేసే అవకాశం ఉంది(అది ప్రజలు సహకరిస్తేనే)అలాంటప్పుడు 20 నుండి 25 టార్గెట్ పెట్టడమంటే ఉపాధ్యాయులను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టడమే అవుతుంది.
దీనివల్ల రవాణ సదుపాయం సరిగ్గా లేని గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయినిలు చాలా అవస్థలు పడాల్సి వస్తుంది.
కావున ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం కాకుండా, అవసరమైతే(ఎక్కువ కుటుంబాలు ఉన్న ఉపాధ్యాయులకు)సర్వే గడువును పొడిగించాలని తపస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.