అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసింది. - మాజీ మంత్రి హరీష్ రావు

On
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేసింది. - మాజీ మంత్రి హరీష్ రావు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల నవంబర్ 12 (ప్రజా మంటలు) : 

అబద్ధపు హామీలతో అధికారములోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి రైతులను అన్ని విధాల మోసం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

రైతు సమస్యలపై కోరుట్ల శాసనసభ్యులు డా. కల్వకుంట్ల సంజయ్ చేసిన పాదయాత్రకు హాజరై హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..... అసెంబ్లీఎన్నికల సందర్భంగా బాండ్ పేపర్లు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే విద్యార్థులు, పోలీసులు, రైతులు ,రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే తమ హక్కుల కోసం రోడ్లెక్కడం దురదృష్టం అని అన్నారు.

రైతుల కోసమే ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర చేశారని ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యేను హరీష్ రావు అభినందించారు. ఈ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని ముందుంది సినిమా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై చురకలు అంటించారు.

దేశానికి వెన్నెముకైనా రైతుల ఇబ్బందులు తొలగించాలన్న డిమాండ్ తోనే కోరుట్ల ఎమ్మెల్యే 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని ఇది రాజకీయం ఎంత మాత్రం కాదని హరీష్ రావు అన్నారు.

సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జగిత్యాలకు చేరుకున్న పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ,ఎమ్మెల్సీ ఎల్.రమణ, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జగిత్యాల కొత్త బస్టాండ్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్ అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.

Tags