మెస్ మెస్ చార్జీల పెంపుతో మురిసిపోతున్న విద్యార్థి లోకం*
విద్యార్థులకు పండ్ల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి
ఎల్కతుర్తి (ప్రజామంటలు)
మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు 40% మెస్ మరియు వ్యక్తిగత చార్జీ పెంచడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి లకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వసతి గృహాలకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మిస్ మరియు విద్యార్థుల యొక్క వ్యక్తిగత శుభ్రత చెల్లించే ఛార్జీల విషయంలో నిర్లక్ష్యం వహించి చిన్నచూపు చూసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గము క్యాబినెట్లో చర్చించి నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారని అలాంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనాలు మరియు సకల సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో విద్యార్థి లోకం ఊహించని రీతిలో 40% మిస్ చార్జి పెంచడం చాలా సంతోషకరమైన విషయమైనప్పటికీ ఇంకా మెరుగ్గా సకల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో విద్యార్థి లోకం వైపే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేదలకు పేద విద్యార్థుల కోసం తప్పించే పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి తో పిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి పాటు మాజీ మండల అధ్యక్షులు సుకేని సంతాజి మండల సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్ ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ మాజీ యూత్ అధ్యక్షులు అంబాల స్వామి ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నాకర్ శనగరపు వెంకటేష్ -స్వరూప డాక్టర్ బొల్లెపోవు రమేష్, శీలం అనిల్ కుమార్ గౌతమ్ రవీందర్,మండల యూత్ అధ్యక్షులు హింగే శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ నాయకులు అంబాల శ్రీకాంత్ శనిగరపు సాహూ అంచనగిరి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు