బాక్సింగ్ పోటీల్లో రాణించిన ఆర్యసమాజ్​ విద్యార్థులు

On
బాక్సింగ్ పోటీల్లో రాణించిన ఆర్యసమాజ్​ విద్యార్థులు

బాక్సింగ్ పోటీల్లో రాణించిన ఆర్యసమాజ్​ విద్యార్థులు

సికింద్రాబాద్ డిసెంబర్​ 01 (ప్రజామంటలు) :

వారాసిగూడ మేడిబావి ఆర్యసమాజ్​ ఉచిత బాక్సింగ్​ ప్రొగ్రామ్​  లో గత కొంతకాలంగా శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఇటీవల హైదరాబాద్​ లో నిర్వహించిన వివిద  బాక్సింగ్​ పోటీల్లో రాణించారు. ఆదివారం ఆర్యసమాజ్​ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాక్సింగ్​ విజేతలను ఘనంగా సన్మానించారు. గోల్డ్ మెడల్స్​ ​ సాధించిన ఆర్​ కె వర్షిణి, ఏ.ప్రణీత్​, శివనందన్​, ఆర్​కె లికిల్​, సిల్వర్​ మెడల్స్​ పొందిన తేజ, శశాంక్​, కృష్ణా, శంకు, బ్రౌంజ్​ మెడల్​ సాధించిన లోకేశ్వర్​ లను ఈసందర్బంగా వీరిని ఆర్యసమాజ్​ ప్రెసిడెంట్​ ఎం.ఆర్​. రవీందర్​  శాలువాలతో సత్కరించారు. భవిష్యత్​ లో జాతీయ స్థాయిలో బాక్సింగ్ పోటీల్లో రాణించి, తెలంగాణకు ఖ్యాతి తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ్​ అద్యక్షులు ఎం.ఆర్​.రవీందర్​, వైస్​ ప్రెసిడెంట్​ డి.జయరాజ్​, ట్రెజరర్​ ఈ యశ్వంత్​, భానుప్రకాశ్​, ఎం.అనసూయ దేవి, శ్రవణ్​ కుమార్​, బాక్సింగ్ కోచ్​ లు శివరాజ్​, రాజేశ్​ లు పాల్గొన్నారు.
–––––––––
–ఫొటో:

Tags