పిల్లల సంరక్షణ, విద్య పట్ల వాల్మీకి ఆవాసం కృషి అభినందనీయం - జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్12 (ప్రజా మంటలు) :
పిల్లల సంరక్షణ, విద్య పట్ల వాల్మీకి ఆవాసం చేస్తున్నా కృషి అభినందనీయం అని జిల్లాస్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జిల్లా సంక్షేమశాఖ, జిల్లా బాలల రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన జిల్లా స్థాయి తనిఖీ కమిటీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం వసతి గృహాల పని తీరుపై, స్థితిగతులపై తనిఖీ చేశారు.
జిల్లా స్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరీష్, తనిఖీ కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, హరి అశోక్ కుమార్, కె.రాజ్ కుమార్, వైద్యాధికారి డా.పి.సతీష్, శిశువైద్యుడు డా.పూర్ణచందర్,వాల్మీకి అవాసం అధ్యక్షుడు జిడిగె పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వాల్మీకి ఆవాసంలో నిర్వాహకులు పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ధ, విద్యా బోధన, భోజన వసతి, ఇతర సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి, నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి తనిఖీ కమిటీ ఛైర్మెన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గౌతంరెడ్డిమాట్లాడుతూ..... పేద, గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చి, విద్యాభ్యాసం చేస్తూ, క్రమశిక్షణతో ఎదగాలని హితవు పలికారు. అనంతరం, ఆవాసం ఆవరణలో మొక్కలు నాటారు.
బాల సదనంలో అనంతరం జిల్లా కేంద్రంలోని బాల సదనం కు వెళ్లి పరిశీలించారు. పారిశుద్యం, సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని అన్నారు. పరిస్థితి మారకుంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.