ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మండల కన్వీనర్ గా గొర్రె మహేందర్*
ఎల్కతుర్తి (ప్రజామంటలు) నవంబర్ 7 .
ఎల్కతుర్తి మండల కేంద్రంలో సాతురి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎల్కతుర్తి మండలం లోని అన్ని గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీల ను ఏకం చేసే కోసం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో అంబేద్కర్ సంఘం నాయకులు ఎంఆర్పిఎస్ సంఘం నాయకులు పాల్గొని రాబోయే రోజులలో మండలంలో అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా అన్యాయాలకు గురవుతున్న కులాలకు ఒక సదస్సు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో సమస్యల పైన హక్కుల పైన పోరాటం చేస్తూ సాధించుకొనుటకు మండల కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగినది ఈ సందర్భంగా సాతురి వెంకన్న మండల కన్వీనర్ లను గా గొర్రె మహేందర్ అంబాల రవీందర్ ను కో కన్వీనర్ కుక్కల రాజు మేకల చేరాలు రేణిగుంట్ల సాంబయ్య ను ప్రకటిస్తూ ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలను ఏకం చేస్తూ ఈ కమిటీ కొనసాగుతుందని అన్ని గ్రామాలలో కమిటీల నియామకం జరిగిన తర్వాత మండల పార్టీ కమిటీని నియమిస్తామని అన్ని గ్రామాల్లోని ప్రజలు ప్రస్తుత కమిటీకి సహకరించాలని మండలంలోని ప్రజలను కోరారు అనంతరం గొర్రె మహేందర్ మండల కన్వీనర్ మాట్లాడుతూ నాకు ఇచ్చిన బాధ్యతను క్రమశిక్షణతో పార్టీలకతీతంగా పనిచేస్తూ మండలంలోని ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తూముల సదానందం తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మేకల చేరాలు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంద రాజు మాదిగ బండారి సురేంద్ర మాదిగ జన్ను దినేష్ మాదిగ గద్దల సుకుమార్ మాదిగ రేణిగుంట్ల సాంబయ్య ములుగురి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు