మల్లన్నపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి
మల్లన్నపేట పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి
గొల్లపల్లి డిసెంబర్ 11 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల మండలంలోని మల్లన్న పేటలో ప్రభుత్వ పాఠశాలలను జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థులతో రాబోయే పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ ఒక ప్రణాళిక రూపొందించుకొని బాగా కష్టపడి చదివి 10 జీపీఏ సాధించే విధంగా కష్టపడాలని సూచించారు.
తదనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు అందరూ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అలాగే డిసెంబర్ నెలాఖరు లోపు సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ స్టార్ట్ చేయాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట సెక్టోరల్ అధికారులు కొక్కుల రాజేష్, చిప్ప సత్యనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొల్లపల్లి మండల విద్యాధికారి జమున, ఉపాధ్యాయులు యాళ్ళ అమర్నాథ్ రెడ్డి, కరుణాకర్, సుధాకర్, రాజేశం, బాలచంద్రుడు, కుమారస్వామి, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, స్రవంతి, రాజనర్సయ్య పాల్గొన్నారు.
తదనంతరం నెట్ బాల్ పోటీల్లో జాతీయస్థాయికి అర్హత సాధించిన మల్లన్న పేట పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జాహ్నవిని జిల్లా విద్యాధికారి అభినందించారు.
పాఠశాలకు మొదటిసారి విచ్చేసిన జిల్లా విద్యాధికారి రామును ఉపాధ్యాయులు శాలువా కప్పి సన్మానించారు