టాస్కా పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ.  

-సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.   

On
టాస్కా పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ.  

టాస్కా పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ.        

-సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.     

జగిత్యాల నవంబర్ 17:

తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ పోరాట ఫలితంగా కేంద్రప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీనీ రూపొందించడానికి నిర్ణయించినట్లు  టాస్కా రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ పేర్కొన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కార్యాలయంలో "కేంద్రం వృద్ధుల సంరక్షణ పాలసీ,సంక్షేమ చట్టానికి సవరణలు "అనే అంశంపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ  తమ టాస్కా రాష్ట్ర అధ్యక్షుడు పి.నర్సింహారావు  ఆధ్వర్యంలో 33 జిల్లాల టాస్కా సంఘాల సభ్యులు  తల్లిదండ్రులు,వృద్ధుల సంరక్షణ,సంక్షేమ చట్టానికి కేంద్రం  సవరణలు చేయాలని ప్రధాన మంత్రికి లక్షలాది పోస్టు కార్డులు పంపి ఉద్యమ కార్యాచరణ చేపట్టిన ఫలితంగా ఈ నెల 16 న కేంద్ర సామాజిక న్యాయ,సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అమిత్ యాదవ్ వృద్ధుల సంరక్షణ పాలసీ ని రూపొందించదానికి కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.జిల్లాలో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి ఆర్డీవోలు మధుసూదన్,జీవాకర్ రెడ్డి,శ్రీనివాస్ లు వృద్ధుల నిరాదరణ కేసులను సత్వరం పరిష్కరిస్తూ రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిచారని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము,ఉపాధ్యక్షుడు పి.హన్మంత్ రెడ్డి,కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు,సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్, ఎండి.యాకూబ్,ఆశోక్ రావు, సత్యనారాయణ,ఇంద్రయ్య,విజయ్ రతన్,జిల్లా,డివిజన్,మండల,గ్రామ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags