ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు - చంద్రబాబు ప్రకటన
బీజేపీ ముందస్తు వ్యూహం లో భాగమేనా?
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు - చంద్రబాబు ప్రకటన
బీజేపీ ముందస్తు వ్యూహం లో భాగమేనా?
అమరావతి డిసెంబర్ 10:
జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు.
దీంతో పాటుగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు.
రాజ్యసభ సీటు అడిగిన నాగబాబుకు కేటాయించక పోవడానికి కా నం, ఒక సీటు బీజేపీ కి కేటాయించడమేనని తెలుస్తుంది.దీనితో జనసేనా నాయకుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ను సంతృప్తి పరచడానికిగాను నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి, తరువాత ఎమ్మెల్సీ తీసుకొనున్నారని తెలుస్తుంది. ఈ పరిణామంతో టీడీపీ పూర్తిగా బీజేపీ, జనసేన చేతిలో కీలుబమ్మలా తయారైందని అనుకొంటున్నారు.
బీజేపీ ముందస్తు వ్యూహం
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిస్థాయిలో అధికారం చేపట్టే దిశలో పావులు కదుపుతుంది, దక్షిణాన పవన్ కళ్యాణ్ అండతో మిగతా పార్టీలను నిర్వీర్యం చేసే ప్రణాళికలో భాగంగానే నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించినట్లు భావిస్తున్నారు.
అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా.. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా.. జనసేన పార్టీకీ నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్లో జనసేన బలం మరింత పెరగనుంది.