కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళ

10 గంటల్లో నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

On
కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళ

కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళ

10 గంటల్లో నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

కరీంనగర్/ కోరుట్ల డిసెంబర్ 12:

కరీంనగర్ లో ఆటోలో బంగారు ఆభరణాలు గల హ్యాండ్ బ్యాగ్ మరిచిపోయిన మహిళకు,10 గంటల్లో నగలు స్వాధీనం చేసుకునీ,నగలు అప్పగించిన పోలీసులను అందరూ అభినందిస్తున్నారు.

గంటల వ్యవధిలో ఆటోను గుర్తించి 10 తులాల బంగారు ఆభరణాలు గల బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని భాదితురాలుకు అప్పగించిన వన్ టౌన్ పోలీసులు*

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన మామిడిపల్లి  హేమశ్రీ  భర్త గణేష్ తో కలిసి కరీంనగర్ లోని ఒక పెళ్లి వేడుకకు హాజరైంది. తిరిగి జగిత్యాలకు వెళ్లేందుకు ఫంక్షన్ హాలు నుండి బస్ స్టాండ్ కు ఆటోలో ప్రయాణించింది. ఆటో దిగి బస్ స్టాండ్ లోకి వెళ్లిన మహిళ కొద్దిసేపటికి తన బ్యాగును ఆటోలోనే మరిచి దిగిందని గ్రహించి అందులో 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

వెంటనే స్పందించిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తన క్రైమ్ సిబ్బందిని అప్రమత్తం చేసి రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించిన పోలీసులు సంబంధిత ఆటో డ్రైవర్ నుండి బ్యాగును,అందులోని 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

భాదితురాలకు అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అందజేశారు. బంగారు ఆభరణాలు గుర్తించి పట్టుకునేందుకు కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, కానిస్టేబుళ్లు కుమార్, సంపత్ లను కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి అభినందించి రివార్డు అందజేశారు.

Tags