ఉపరాష్ట్రపతి పై ప్రతిపక్షాల అవిశ్వాసం నోటీసు ఇవ్వనున్న కాంగ్రెస్

On
ఉపరాష్ట్రపతి పై ప్రతిపక్షాల అవిశ్వాసం నోటీసు ఇవ్వనున్న కాంగ్రెస్

ఉపరాష్ట్రపతి పై ప్రతిపక్షాల అవిశ్వాసం - నోటీసు ఇవ్వనున్న కాంగ్రెస్

న్యూ ఢిల్లీ డిసెంబర్ 10: 

రాజ్యసభలో సభాపతి,ఉపరాష్ట్రపతి అయిన జగ్దీప్ ధన్కడ్ పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినున్నట్లు తెలుస్తుంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపడించడానికి 50 మంది సభ్యుల సంతకాలు అవసరముండగా, ఇప్పటి వరకు 70 సంతకాలు సేకరించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ తోపాటు, టీ ఎం సి, ఎస్ పి లుకోడా మద్దతు ఇవ్వడం గమనార్హం. 

జగదీప్ ధన్కడ్ సభలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, అధికార బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా ఉన్నారనే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత రెండు రోజులుగా బీజేపీ సభ్యులకు ప్రత్యేకమైన చొరవతో చర్చకు అవకాశం ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పు పడుతుంది. ఈనేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తీర్మానం నోటీసు 14 రోజుల ముందు ఇవ్వాలి. డానీ తరువాతే చర్చ, ఓటింగ్ జరుగుతుంది 

Tags