శ్రీధరా…నీవైన అవినీతి విముక్తి చేయవా….! దళారుల దోపిడీ నుండి విముక్తి కోరుతున్న ముక్తేశ్వరుడు
సరస్వతి నది పుష్కరాల నిర్వహణ బాధ్యత మంత్రి శ్రీదర్ బాబుకే
శ్రీధరా…నీవైన అవినీతి విముక్తి చేయవా….!
దళారుల దోపిడీ నుండి విముక్తి కోరుతున్న ముక్తేశ్వరుడు
సరస్వతి నది పుష్కరాల నిర్వహణ బాధ్యత మంత్రి శ్రీదర్ బాబుకే
కాళేశ్వరం డిసెంబర్ 10:
కాశి కన్నా వరిముళ్ళు అంత వాసి కల క్షేత్రం గా చెప్పుకునే. దర్శనం కాదు స్మరణ మాత్రం తోనే మోక్షం ఇచ్చే కాళేశ్వరం దేవాలయం ను కొంత మంది వ్యక్తులు, ఉద్యోగుల నుండి విముక్తి ఎలా అని చూస్తుంది.
దీనికి ఆ మా శ్రీధరుడే తగినవాడని నిర్ణయించు కుంది.
కొంతమంది అర్చక సిబ్బంది, కొన్ని నెలల క్రితం పదవీవిరమణ చేయడం. కొంతమంది ప్రభుత్వ పాలన లోకి వెళ్లిన వారికి కూడా ఇంకా కొన్ని EPF లాంటి వాటిని సెటిల్ చేయకపోవడం తో అధికారులు ఏమైనా ఆశిస్తున్నారా లేక చేతకాని తనమా అర్థం కాక ప్రజలు పెదవివిరుస్తున్నారు.
రెగ్యులర్ EO లేక ఇంచార్జి EO వున్నా లేనిచ్చందంగా మారి, అడకత్తెరలో పోకచేక్క మాదిరి దేవాలయం పరిస్థితి అయింది అని అనుకొంటున్నారు. ఇక్కడి దేవాలయం స్థాయి పెంచి, దేవాలయ పాలన గాడి లో పెట్టె అధికారిని పంపించాలని స్థానికులు, భక్తులు బాహాటంగానే కోరుకొంటున్నారు
గత కొన్ని దశాబ్దాలుగా పాతుక పోయిన అవినీతి ఉద్యోగులను నిర్ములించి, ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలను నిర్వహించె్ ఆ గురుతర బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధరునికి సర్వ అధికారాలతో శ్రీ కాళేశ్వర ముక్తాఈశ్వర స్వామివార్లు ఇచ్చినట్టున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
దేవాలయ పాలన గాడి తప్పిన ఈ సమయంలో మంత్రి, ఎలా దీన్ని తీర్చి దిద్దుతారో, భక్తులకు ఇబ్బందులు కలగ కుండా ఎలా ఈ పుష్కరాలు నడిపిస్తారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి