సర్వ శిక్షా అభియాన్ . ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వినూత్న రీతిలో నిరసన

On
సర్వ శిక్షా అభియాన్ . ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వినూత్న రీతిలో నిరసన

సర్వ శిక్షా అభియాన్ . ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వినూత్న రీతిలో నిరసన

 మంత్రుల, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల  మాస్కులతొ నిరసన
 
జగిత్యాల డిసెంబర్ 12 (ప్రజా మంటలు):

జిల్లా కేంద్రంలో సర్వ శిక్షా అభియాన్ . ఉద్యోగుల అధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత రెండు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. 

ఈ దీక్షలో భాగంగా బుధవారం స్థానిక తహసిల్ చౌరస్తాలో సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.

అందుగ్గాను  వారి మాస్కులను ధరించి,  వినతి పత్రాల ప్లే కార్లలు పట్టుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కొత్తగా ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఇచ్చిన హామీలు నెరవేర్చి సర్వ శిక్షణ అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు కోరారు.

Tags