రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ - సహజ హక్కుల తర్వాతే అన్ని హక్కులు 

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో మాడ భూషి శ్రీధర్

On
రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ - సహజ హక్కుల తర్వాతే అన్ని హక్కులు 

రాజ్యాంగాన్ని రక్షిస్తేనే హక్కులకు రక్షణ - సహజ హక్కుల తర్వాతే అన్ని హక్కులు 

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకల్లో మాడ భూషి శ్రీధర్

జగిత్యాల డిసెంబర్ 11: 
భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే మన హక్కులకు రక్షణ ఉంటుందని జాతీయ సమాచార కమీషన్ రిటైర్డ్ కమిషనర్, జాతీయ విద్యావేత్త మాడభూషి శ్రీధర్ అన్నారు. జగిత్యాల జిల్లా చలిగల్ ప్రాంతంలోని శ్రీ లక్ష్మీ నరింహ ఫంక్షన్ హాల్ లో మంగళ వారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

జాతీయ మానవ హక్కుల మండలి (ఎన్.జి. వో) జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. సంస్థ జాతీయ అధ్యక్షులు అయిల్నేని శ్రీనివాస్ రావు తో పాటు మాడభూసి శ్రీధర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

IMG-20241211-WA0010IMG-20241211-WA0010

ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ మానవులకు సహజ హక్కులే ఎక్కువగా ఉంటాయన్నారు. రాజ్యాంగ బద్ధంగా చట్టపరమైన హక్కులు వచ్చాయని వివరించారు. హక్కులు అడిగితే వస్తాయి తప్పా మౌనంగా ఉంటే ఏ హక్కు దరిచేరదు అని వివరించారు. మానవులలో ప్రశ్నించే తత్వం పెరుగాలని, జవాబు అడిగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. యావత్ ప్రపంచంలో హక్కులను అడిగి పొందే హక్కు కేవలం భారత దేశంలోనే ఉందని వివరించారు.

అది కూడా భారత రాజ్యాంగ పరంగా  వచ్చిందన్నారు. సంస్థ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు ఐల్నేని శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు, నిర్మాణం, సంస్థ సేవలు, ఇప్పటివరకు సంస్థ అభివృద్ది చెందిన తీరు, అనతికాలంలోనే సాధించిన విజయాలను వివరించారు. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు నేషనల్ హుమాన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్.జి.ఓ) ను విస్తరించ నున్నట్లు ఆయన తెలిపారు.  

వాఖ్యతగా హరి శంకర్ వ్యవహరించారు. సభాధ్యక్షులు అయిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం మాట్లాడుతూ సంస్థ చేసిన సేవలు, సాధించిన విజయాలను వివరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి. లక్ష్మారెడ్డి, సీనియర్ న్యాయవాది బండ భాస్కర్ రెడ్డి లు మాట్లాడుతూ చట్టాలు - హక్కులు, వాటిని సాధించే విధానాలను వివరించారు. సీనియర్ జర్నలిస్ట్, హక్కుల ఉద్యమ కారుడు చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కుల కార్యకర్తగా ఎదిగి ప్రశించినప్పుడే మన చట్టపరమైన హక్కులను సాధించుకోగలమని తెలిపారు. శ్రీనివాస్ రావు స్థాపించిన ఈ సంస్థ జాతీయ స్థాయిలో ఎదిగి, హక్కుల సాధనలో,  సమాజనేవలో  అగ్రస్థానంలో నిలవాలని ఆకాక్షించారు. ఈ సంస్థ నిర్వాహకులు, తాను ఈ మధ్య కాలంలో సాధించిన విజయాలను వివరించారు. 


జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.లక్ష్మా రెడ్డి, సీనియర్ న్యాయవాది బండ భాస్కర్ రెడ్డి, సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరమల్ల సందీప్, కార్యదర్శి నాగరాజు,  సేర్ప్ ఎ.ఓ. శ్రీనివాస రావు, లంక దాసరి శ్రీనివాస్, రమేష్, అస్ఘర్ ఖాన్, గౌరిషెట్టి చంద్ర శేఖర్, హరిశంకర్, అప్పం చిన్నారెడ్డి, కొక్కుల ప్రభాకర్, ప్రశాంత్ రావు, కాసారాపు శంకర్ గౌడ్, డా. నక్క రాజు, గడ్డం శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.

Tags