సమగ్ర కుటుంబ కులగణనకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత దంపతులు 

On
సమగ్ర కుటుంబ కులగణనకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత దంపతులు 

సమగ్ర కుటుంబ కులగణనకు సహకరించిన ఎమ్మెల్సీ కవిత దంపతులు 

హైదారాబాద్ నవంబర్ 16: 

సమగ్ర కుటుంబ కులగణనకు  ఎమ్మెల్సీ కవిత దంపతులు బంజారా హిల్స్ లోని తన నివాసంలో అధికారులు అడిగిన వివరాలు ఇచ్చి, సహకరించారు.

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని మొదటి నుండి పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.

గతంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోసం పలు సమావేశాలు, సభలు,రౌండ్ టేబుల్  సమావేశాలను ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేశారు.

రీసెంట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కుల గణన విషయంలో తమ వద్దకు ఎన్యుమరెటర్ లకు అన్ని వివరాలు  ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు అందజేసారు 

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Tags