గాంధీ ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్ మెంట్ అందచేసిన అమెరికా డాక్టర్
గాంధీ ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్ మెంట్ అందచేసిన అమెరికా డాక్టర్
సికింద్రాబాద్ డిసెంబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) డాక్టర్ దివేష్ ఆర్ అనిరెడ్డి USA సహకారంతో గాంధీ ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ కు గురువారం వైద్య పరికరాలను అందించారు. ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన ₹27 లక్షల విలువ చేసే అడ్వాన్స్డ్ ఏసోఫెగల్ అండ్ అనాల్ మనోమెట్రీ మిషను ను గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిరా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి, గ్యాస్ర్టోఎంట్రాలజీ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ డా.శ్రవణ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ మెడికల్ ఎక్విప్ మెంట్ తో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించగలుతుగామని గ్యాస్ర్టో ఎంట్రాలజీ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ–1 డా, శేషాద్రి, కిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ నితీష్ ప్రతాప్, TDF ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, పీజీ డాక్టర్లు డా.అనిల్, డా.దృవ, డా.ప్రియాంక, డా.స్నేహిత, డా.మరియం, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి గ్యాస్ర్టో ఎంట్రాలజీ డిపార్ట్ మెంట్ కు మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందచేసిన టీడీఎఫ్ ఆర్గనైజర్లను పలువురు అభినందించారు.
–––––––––