జగిత్యాలలో కన్న కొడుకుల కర్కశత్వం కన్న తల్లిని తిరిగి మళ్లీ స్మశానంలో వదిలి వెళ్ళిన వైనం

On
జగిత్యాలలో కన్న కొడుకుల కర్కశత్వం కన్న తల్లిని తిరిగి మళ్లీ స్మశానంలో వదిలి వెళ్ళిన వైనం

జగిత్యాలలో కన్న కొడుకుల కర్కశత్వం
కన్న తల్లిని తిరిగి మళ్లీ స్మశానంలో వదిలి వెళ్ళిన వైనం

జగిత్యాల డిసెంబర్ 10:

కన్న కొడుకులు పట్టించుకోకపోవడంతో స్మశానమే ఆ పండుటాకుకు ఆశ్రయంగా మారింది. తల్లిని ఇంట్లో ఉంచుకోలేని కొడుకే స్వయంగా తల్లిని రెండోసారి స్మశానంలో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. 

పట్టణంలోని చిలుక వాడకు చెందిన రాజవ్వ కుమారుడు శ్రీనివాస్ మళ్ళీ వస్తానని చెప్పి మోతే స్మశాన వాటికలోని ఓ రూమ్ లో కన్న తల్లిని వదిలిపెట్టి వెళ్ళాడు. చనిపోయిన తమ బంధువుల మూడు రోజుల కార్యం కోసం స్మశాన వాటికకు వెళ్ళిన ఓ మహిళకు గదిలో నుండి వృద్ధురాలి మాటలు వినిపించాయి. వెంటనే వెళ్లి చూడగా కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు కనబడింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని ఆరా తీయగా తన కొడుకు శీను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడని తనను ఉంచడానికి ఎక్కడైనా గది చూసి వస్తానని వదిలి వెళ్ళినట్లు తెలిపింది.

" కొంచెం అన్నం పెట్టండి.. చీరే ఉంటే ఇవ్వండి అంటూ వృద్ధురాలు మాట్లాడిన మాటలు" అక్కడ ఉన్న వారి హృదయాలను కరిగించాయి. తమతో రావాలని ఆసుపత్రిలో వైద్యం చేయించి మరోచోట ఉంచుతామని మహిళలు అడగగా తన కొడుకు వచ్చి తీసుకువెళ్తాడని వృద్దురాలు రాజవ్వ అమాయకంగా బదులిచ్చింది. అయితే తనకు రాత్రి నిద్ర పట్టడం లేదని దయ్యాలు పిలుస్తున్నాయని భయంగా ఉందని రాజవ్వ ఆవేదన వ్యక్తం చేసింది.

12 రోజుల క్రితమే కొడుకుకి కౌన్సిలింగ్ అయినా, మళ్ళీ స్మశానానికే అయితే 12 రోజుల క్రితం వృద్ధురాలు రాజవ్వ స్మశానంలో ఉంటుందన్న విషయం తెలుసుకొని జిల్లా సంక్షేమ అధికారి నరేష్ ఆస్పత్రిలో చికిత్స చేయించి అనంతరం సఖి కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత రాజవ్వ  కొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించగా ఇంటికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ వృద్ధురాలిని తిరిగి స్మశానంలో వదిలిపెట్టడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంది. రాజవ్వ కొడుకుల పై వయో వృద్ధుల సంరక్షణ చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags