పురానీపెట్ ఉన్నత పాఠశాలలో 13.5 లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 16 (ప్రజా మంటలు) :
విద్యార్థులు ఉన్నత ఆలోచనలు చేసి వాటిని సాధించడానికి కృషి చేయాలని క్రీడల్లో,చదువులో గెలుపు ఓటములు సహజమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్యానికి కృషి చేస్తుందన్నారు.
రాష్ట్రం లో స్కిల్ యూనివర్శిటీ,స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తుంది.
జగిత్యాల మహిళ డిగ్రీ కళాశాల కి 5 కోట్ల తో నూతన భవనం,తరగతి గదులు మంజూరు.
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది అని,జగిత్యాల కి కూడా త్వరలో పాఠశాల రానుంది అని అన్నారు.
తాను ప్రభుత్వ పాఠశాల లో చదువుకున్నానని గుర్తు చేశారు.
అధికారులు, ప్రజా ప్రతినిదులు కలిసి పని చేస్తేనే అభివృద్ధి పనులు సాధ్యమన్నారు.
ప్రతి ఒక్కరూ భాధ్యత తో పని చేయాలని బీర్పూర్ కేజీబీవి ప్రారంభం విషయం లో ఆలస్యం కావడం చాలా బాధాకరమన్నారు.
సైన్స్ ల్యాబ్ ఏర్పాటు తో విద్యార్థులు సాంకేతిక,సైన్స్ పరిజ్ఞానానికి చాలా దోహదం చేస్తాయన్నారు.
దాతలు,పూర్వ విద్యార్థులు సహకారం తో సైతం పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, చిరంజీవి,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,స్థానిక కౌన్సిలర్ పులి రమ,హెడ్ మాస్టర్ రాజయ్య ఏ ఈ ధనుంజయ్,కో ఆప్షన్ సభ్యులు ఎంఈఓ శ్రీనివాస్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు ఆనంద్ రావు,కౌన్సిలర్ కోరే గంగ మల్లు,నాయకులు బట్టు సుధాకర్, వీర బత్తిని శ్రీనివాస్,కోలగాని సత్యం, పుల్ల మల్లయ్య,ప్రభాథ్ సింగ్ ఠాగూర్, కత్రోజ్ గిరి, గట్టు రాజు,రంగు మహేష్,ఏనుగుల రాజు, చోట్ల మనోహర్,క్రాంతి,సంగెం శ్రీనివాస్, ఉపాద్యాయులు, విద్యార్ధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.