గాంధీ ఆసుపత్రి షెల్టర్ హోమ్ పేద పేషంట్లకు వరం
గాంధీ ఆసుపత్రి షెల్టర్ హోమ్ పేద పేషంట్లకు వరం
* సందర్శించిన భోపాల్ సేవాభారతి కార్యదర్శి
సికింద్రాబాద్ డిసెంబర్ 10 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రికి దూర ప్రాంతాల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషంట్ సహాయకులకు జనహిత షెల్డర్ హోమ్ అందిస్తున్న సేవలను అభినందనీయమని మద్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి వచ్చిన సేవా భారతి సంస్థ జాతీయ కార్యనిర్వహాక కార్యదర్శి విజయ్ పురానిక్ అన్నారు. తెలంగాణ కార్య నిర్వాహక కార్యదర్శి వాసుతో కలసి ఆయన మంగళవారం గాంధీ దవఖానలో జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షెల్డర్ హోమ్ ను సందర్శించారు. ఏప్రిల్ 2024 నుంచి ఇక్కడ లభిస్తున్న ఉచిత సేవల గురించి మేనేజింగ్ ట్రస్టీ ఎన్.నర్సింహామూర్తి, షెల్టర్ హోమ్ మేనేజర్ నందకుమార్ వారికి వివరించారు.రాష్ర్టంలోని ఇతర జిల్లాల నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చే పెషంట్లు, వారి సహాయకులకు, కుటుంబసభ్యులకు ఉచితంగా వసతి, తాగునీరు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, దుప్పట్లు, చాప, దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం అల్ఫాహారం, రెండు పూటలా భోజనం సదుపాయాలు కల్పిస్తున్నామని ఆయన వివరించారు. గాంధీ , ఉస్మానియా, నీలోఫర్, ఎ.ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లలో బయట రోగుల విభాగాలల్లో హెల్ప్ డెస్క్ లను కూడ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.