రేపటి మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్సై సతీష్

On
రేపటి మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్సై సతీష్

రేపటి మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి.. ఎస్సై సతీష్

గొల్లపల్లి డిసెంబర్ 10 ప్రజా మంటలు


జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రేపు అనగా 11న,  ఉదయం 10 గంటలకు  జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడును ఎస్సై సతీష్ తెలిపారు మంగళవారం బీబిరాజు పల్లి, చిల్వకోడూరు విసిట్ చేసి అక్కడ గ్రామ యువతీ యువకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు.

రేపటి మెగా జాబ్ మేళాను  సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు జాబ్ మేళాలో దాదాపు వివిధ రకాలైన 50కి పైగా కంపెనీలు రేపు జాబ్ మేళలో పాల్గొంటారని 10వ తరగతి పాసైన యువతి యువకుల లతో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ,ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ చదువుకున్న యువతి యువకులకు కూడా రేపటి జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు వారి అర్హతలను బట్టి కల్పించబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవెల్ల సత్యనారాయణ, బొమ్మేన కుమార్, యూత్ లీడర్ వెంకటేష్ గౌడ్  యువతి ,యువకులు పాల్గొన్నారు.

Tags